జాబ్ దొరకని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎనిమిది లక్షల మంది.. ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నారు!

Header Banner

జాబ్ దొరకని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఎనిమిది లక్షల మంది.. ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నారు!

  Sat Mar 18, 2017 12:39        Education, Telugu

ఎంసెట్ రాసేస్తున్నారు.. ఇంజ‌నీరింగ్ కాలేజీల్లో చేరిపోతున్నారు.. బీటెక్ స‌ర్టిఫికెట్ అందుకుంటున్నారు.. ఆ త‌రువాత నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ప్ర‌తి ఏడాది వేల‌మంది విద్యార్థుల‌ ప‌రిస్థితి ఇది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అందుకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. అందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగిత ప్రతి ఏడాది అధిక‌మ‌వుతూనే ఉంద‌ని పేర్కొన్నారు. ఇంజ‌నీరింగ్ పూర్తి చేసిన వారిలో కొద్ది మందికి మాత్ర‌మే ఉద్యోగాలు వ‌స్తున్నాయ‌ని మిగతా వారందరూ నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని గ‌ణాంకాల ద్వారా తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్ లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స‌ర్టిఫికెట్ పొందిన వారిలో 60 శాతం మందికి పైగా నిరుద్యోగులుగానే ఉన్నారు. వారి సంఖ్య ఎనిమిది లక్షలని స్ప‌ష్టం చేసింది. ఒక శాతం మంది కంటే తక్కువమందే సమ్మర్ ఇంటర్న్ షిప్ లో పాల్గొంటున్నారు. 15 శాతం ఇంజనీరింగ్ ప్రొగ్రామ్స్ నే ఇన్ స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తున్నాయని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పేర్కొంది. ఇంజ‌నీరింగ్ విద్యార్థులు ఎదుర్కుంటున్న‌ ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్ర‌ మానవ వనరుల అభివృద్ధి శాఖ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ను పునరుద్ధరించాల‌ని యోచిస్తోంది. వ‌చ్చే ఏడాది జనవరి నుంచి టెక్నికల్ ఇనిస్టిట్యూషన్స్ అన్నింటికీ కలిపి ఒకే ప్ర‌వేశ ప‌రీక్ష‌ నిర్వహించాలని ప్ర‌ణాళిక వేస్తోంది.   b tech, graduates, engineering graduates, degree certificates