పదో తరగతి పరీక్షల్లో.. ఇకపై ఆరు పేపర్లు

Header Banner

పదో తరగతి పరీక్షల్లో.. ఇకపై ఆరు పేపర్లు

  Fri Mar 10, 2017 22:30        Education, India, Telugu

వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆరు సబ్జెక్ట్ పేపర్లుంటాయని సీబీఎస్‌ఈ ప్రకటించింది. ప్రస్తుతం రెండు లాంగ్వేజెస్‌తో పాటు గణితం, సైన్స్, సోషల్ సైన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఐచ్చికంగా ఉన్న ఒకేషనల్ సబ్జెక్ట్‌ను ఇకపై తప్పని‌సరి చేయనున్నారు. 13 ఒకేషనల్ సబ్జెక్ట్లలో ఒకదాన్ని విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
 
 
దీంతో వచ్చే ఏడాది నుంచి విద్యార్థులు పదో తరగతి కామన్ పరీక్షల్లో ఆరు సబ్జెక్టుల పేపర్లు రాయాల్సి ఉంటుందని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. అయితే మూడు ప్రధాన సబ్జెక్టులోని ఒక దానిలో ఫెయిలయితే ఒకేషనల్ సబ్జెక్ట్‌ మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఒకవేళ విద్యార్థి తిరిగి ప్రధాన సబ్జెక్ట్ పరీక్ష రాస్తే దాన్నే లెక్కలోకి తీసుకోనున్నట్లు సీబీఎస్‌ఈ వెల్లడించింది.


   పదో తరగతి పరీక్షల్లో.. ఇకపై ఆరు పేపర్లు