చెమటకాయల నుంచి ఉపశమనం ఇలా!

Header Banner

చెమటకాయల నుంచి ఉపశమనం ఇలా!

  Fri Mar 10, 2017 21:13        Health, Telugu

రోజురోజుకి ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఈ సమయంలోనే చర్మంపై చెమటకాయలు తయారౌతాయి.

వీటి వల్ల చర్మం దురద రావడమొక్కటే కాదు అది చర్మం మృదుత్వాన్ని కూడా పాడుచేస్తుంది. కొన్ని సహజ సిద్ధమైన చిట్కాలతో చెమటకాయలు నివారించుకోవచ్చు.

లవంగ నూనె : చర్మాన్ని సంరక్షించే ఎన్నో మంచి లక్షణాలు లవంగ నూనెలో ఉన్నాయి. కాటన్‌ బాల్‌ను లవంగ నూనెలో ముంచి శరీరంపై రాస్తే చెమట కాయలు తగ్గుతాయి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కలబంద: కలబంద గుజ్జు కొంచెం తీసుకుని చెమట కాయలు ఉన్నచోట రాయాలి. కలబందలో ఉండే ఆస్ట్రిజెంట్‌ లక్షణాలు చెమట కాయలను నిర్మూలించడంలో మెరుగ్గా పనిచేస్తాయి. చర్మంపై ఉండే ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. రోజులో ఎక్కువ సమయం వేడి వాతావరణంలో గడిపే వారికి అలోవెరా జెల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

టీ ట్రీ ఆయిల్‌: టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కొంచెం టీ ట్రీ ఆయిల్‌ తీసుకుని దానికి కొంత నీటిని కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. ఆ మిశ్రమంలో కాటన్‌ బాల్‌ను ముంచి, చర్మంపై రాస్తే చెమటకాయలు తగ్గిపోతాయి.

ఓట్స్‌: కొద్దిగా ఓట్స్‌ను మిక్సీలో వేసి, పౌడర్‌గా పట్టుకోవాలి. దాంట్లో కొంత గోరువెచ్చని నీటిని పోయాలి. అనంతరం దాన్ని బాగా కలపాలి. దీన్ని చెమటకాయల మీద రాయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే చెమటకాయలు తగ్గుతాయి.

ఐస్‌ ప్యాక్‌: శుభ్రమైన కాటన్‌ క్లాత్‌ను తీసుకుని, అందులో కొన్ని ఐస్‌ ముక్కలను వేయాలి. అనంతరం ఆ ఐస్‌ ప్యాక్‌ను చెమటకాయలపై పావు గంట సమయం మసాజ్‌ చేసినట్టు రాయాలి. దీంతో వాటి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలా చెమటకాయలు తగ్గేవరకు ప్రతి మూడు గంటలకోసారి ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.

వెనిగర్‌ : వెనిగర్‌లో ఉండే అసిటిక్‌ యాసిడ్‌ చర్మాన్ని సంరక్షిస్తుంది. టిష్యూ పేపర్‌ని వెనిగర్‌లో ముంచి చెమట కాయలు ఉన్న చోట అద్దాలి. ఇలా చేస్తే చెమట కాయలు త్వరగా తగ్గుతాయి.

బ్లాక్‌ టీ: కొద్దిగా బ్లాక్‌ టీని తీసుకుని చర్మంపై రాయాలి. దీనివల్ల కూడా చెమటకాయలు తగ్గుతాయి. చర్మానికి సంరక్షణ అందుతుంది.

 


   Relief-from-sweet