శుభవార్త చెప్పిన పేటీయం... ఎవరికీ లాభం!

Header Banner

శుభవార్త చెప్పిన పేటీయం... ఎవరికీ లాభం!

  Fri Mar 10, 2017 10:53        Business, Telugu

ప్రముఖ నగదు చెల్లింపుల మాధ్యమ సంస్థ పేటీయం యూ టర్న్ తీసుకుంది. 24 గంటలు కూడా గడవక ముందే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. క్రెడిట్ కార్డు ద్వారా పేటీఎం వాలెట్ ను రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు 2 శాతం ఛార్జీ విధిస్తామంటూ నిన్న పేటీఎం ప్రకటించింది. ఈ నిర్ణయంపై వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, తమ నిర్ణయం యూజర్లకు అసౌకర్యం కలిగించిందనే విషయం తమకు తెలిసిందని... అందుకే ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని పేటీఎం తెలిపింది. చాలా మంది వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం వాలెట్ లోకి డబ్బును ట్రాన్స్ ఫర్ చేసి, ఆ తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లలోకి నగదును బదిలీ చేసుకుంటున్నారని... దీని వల్ల తాము నష్ట పోతున్నామని, అందుకే 2 శాతం ఛార్జీ విధిస్తున్నట్టు పేటీఎం నిన్న తెలిపింది.



   pay tm ,two percent,credit card,users