పిల్లలూ.. ఆటలాడండి !

Header Banner

పిల్లలూ.. ఆటలాడండి !

  Thu Mar 09, 2017 21:26        Health, Telugu

పిల్లలూ! మీరు రోజూ వ్యాయామం చేస్తారా? అయినా మీకు అంత సమయం ఉంటుందా? పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు చదువు.. చదువు.. తప్ప ఇంకోటి ఉండటం లేదు కదా!? అలా చేస్తే.. ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. దాని నుంచి ఉపశమనం లభించాలంటే వ్యాయామం తప్పనిసరి. అది ఆటల రూపంలో కావచ్చు, మరే రూపంలో అయినా సరే! వ్యాయామంతో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆటలాడుకోవడం ద్వారానే పిల్లల్లో ఎక్కువ వ్యాయామం చేసినట్లవుతుంది. దీనివల్ల ఒత్తిడి నుంచి మెదడును రిలాక్స్‌ చేసుకోవడానికి తోడ్పడుతుంది. వ్యాయామం చేస్తే ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం!

శారీరక పెరుగుదలతో పాటు మానసికంగా వృద్ధి చెందడం ద్వారా చదువుపై సులభంగా శ్రద్ధ చూపుతారు. కచ్ఛితమైన, నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో ముందుంటారు. వ్యాయామం గుండెను పదిలం చేస్తుంది. మెదడును చురుగ్గా పనిచేయిస్తుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మానసిక దృఢత్వం, మానసిక వికాసం పెంపొందుతుంది. దృఢమైన కండరాలు, ఎముకల పెరుగుదల, కీళ్ళు బలపడతాయి. వ్యాయామంతో ఆక్సిజన్‌ అధికంగా పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేస్తాయి. గుండె పదిలం అవుతుంది. రక్త ప్రసరణ సక్రమం అవుతుంది. బాగా ఆకలేస్తుంది. శరీరంలోని అన్ని భాగాలూ సక్రమంగా పనిచేస్తాయి. అందరితో కలిసి ఆట్లాడుకోవడం ద్వారా మానవీయ విలువలు పెరుగుతాయి. కాబట్టే రోజూ ఏదో ఒక రూపంలో వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండే.   Health-in-games-for-children