గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌లో తరగతుల వారీ కటాఫ్‌ మార్కులు

Header Banner

గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌లో తరగతుల వారీ కటాఫ్‌ మార్కులు

  Mon Mar 06, 2017 22:49        Education, Telugu

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌ పరీక్షలో అన్ని తరగతుల వారికి జనరల్‌ కటాఫ్‌ మార్కులు పెట్టడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. జనరల్‌ కటాఫ్‌ పెడితే రిజర్వేషన్‌ తరగతులైన దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, మహిళలు, దివ్యాంగులకు నష్టం జరుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది దళిత, బలహీన వర్గాల వారికి నష్టం కలిగించడమే అవుతుందని పేర్కొన్నారు. అందరికీ ఒకే కటాఫ్‌ కాకుండా ఆయా తరగతుల వారీ కటాఫ్‌ మార్కుల విధానాన్ని పాటించాలని కోరారు. అప్పుడే ఆయా తరగతుల వారికి న్యాయం జరుగుతుందని సూచించారు. గ్రూప్‌-2 ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్లు అమలు కాకపోతే దళిత,గిరిజన, బలహీన వర్గాలు దేశ నిర్మాణంలో తగిన పాత్ర వహించలేవని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా తరగతుల వారీ కటాఫ్‌ ఉండాలని కోరారు. ఉద్యమాలు ఊపందుకోకముందే ప్రభుత్వం మేల్కొని వ్యవహరించాలని కోరారు.   Group2-cutoff-marks-categorywise