స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించిన ‘వివో’

Header Banner

స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించిన ‘వివో’

  Fri Mar 03, 2017 22:41        Gadgets, Telugu

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ.. ‘వివో వై 51 ఎల్’ స్మార్ట్‌ఫోన్ ధరను గణనీయంగా తగ్గించింది. ప్రస్తుతం రూ.11,980కి అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను ఇక నుంచి రూ.8,990కే అందించనున్నట్టు ప్రకటించింది. ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్ల విషయానికి వస్తే ఐదంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఓఎస్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. 8 ఎంపీ వెనక, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2350 ఎంఏహెచ్‌ బ్యాటరీ.. వంటి ఫీచర్లు ఉన్నాయి.   Vivo-Rates