'ఏకాంతం ఎంతహాయి..!'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

'ఏకాంతం ఎంతహాయి..!'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Thu Jan 12, 2017 11:28        Rachanalu (రచనలు), Telugu

పరిమళించు గులాబీలు ప్రకటించెను యుద్దమేదొ..!?
తన చెక్కిలి సింధూరమె సృష్టించెను యుద్దమేదొ..!?

సున్నితమౌ ఆ పెదవుల మధువు రుచిని తెలుపరాదు..
తన మువ్వల ఆసవ్వడి నేర్పించెను యుద్దమేదొ..!?

ప్రతి ఆటా సమరమనే సంగతెలా చెప్పాలో..
తన అలుకల కొలువేమో చూపించెను యుద్దమేదొ..!?

విరహంతో కాల్చలేని ఏకాంతం ఎంతహాయి..!
తన మౌనపు కోవెలయే మరపించెను యుద్ధమేదొ..!?

చిరునవ్వుల కత్తి అంచు అమృతమధుర ధార కదా..!
తన వలపుల పదునేమో పండించెను యుద్దమేదొ..!?

సరిహద్దులు ఉంటాయా మాధవుడా ప్రేమనిధికి..!?
తన చెలిమియె పసిడిజల్లు..కరిగించెను యుద్దమేదొ..!?

 

 

- మాధవరావు కొరుప్రోలు


   గులాబీలు,సవ్వడి,మధువు, రుచి,ఏకాంతం,పసిడిజల్లు,అలుక