కువైట్ లో ఎన్‌టిఆర్‌ వర్దంతి కి ప్రవాసాంధ్ర తెలుగు దేశం ఆధ్వర్యంలో 'రక్తదాన శిబిరం'

Header Banner

కువైట్ లో ఎన్‌టిఆర్‌ వర్దంతి కి ప్రవాసాంధ్ర తెలుగు దేశం ఆధ్వర్యంలో 'రక్తదాన శిబిరం'

  Thu Jan 12, 2017 10:24        Associations, Exclusives, Kuwait, Telugu

తెలుగుజాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్‌టి రామారావు జీవితం తరతరాల తెలుగు జాతికి ఆదర్శంగా నిలిచిపోతుంది.నటనలో, రాజకీయరంగాల్లో చరిత్ర సృష్టించిన ఎన్‌టి రామారావు వ్యక్తిత్వం, ఔన్నత్వం గురించి విభిన్న కోణాల్లో దిగ్విణీక్రుతం అవుతుంది. పౌరాణిక, చారిత్రక సినిమాలు ఏవైనా ఆయనతో పోటీపడి చేసేవారు నేడు లేరు. రాజకీయాల్లో కూడా అతి తక్కువ కాలంలో పెనుమార్పులు తీసుకువచ్చారు, అలాగే సామాజానికి ఎవరు మంచి పనిచేస్తే వారు ఎప్పటికీ గుర్తుండిపోతారనే విషయం ఎన్‌టి రామారావు విషయంలో నిరూపితమైంది. అలాంటి మహనీయుడి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఎన్‌టిఆర్‌  ట్రస్ట్‌ ద్వారా ఈరోజున ఎంతో మంది నిరుపేదలకు విద్య, వైద్య, బ్లడ్‌బ్యాంకు, ఉపాధి, తాగునీరు, సహాయ పునరావాస కార్యక్రమాల్లో సేవలందిస్తున్నారు.

ఈ సేవలలో భాగంగా అత్యవసర పరిస్థితిలో రక్తం అందక వేలాది మరణాలు సంభవిస్తున్నట్లు ఎన్‌టిఆర్‌ ట్రస్టు నిర్వాహకులు, సిఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి గుర్తిస్తున్న నేపధ్యంలో ఎంటిఆర్‌కు నివాళిగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జనవరి  18వ తేది ఎన్‌టిఆర్‌ వర్దంతి పురస్కరించుకుని పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వ్హహించాలని పిలుపు ఇచ్చారు. 

అయితే కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాక విదేశాలలో కూడా ఎన్ టి ఆర్ ట్రస్ట్ ఈ సేవాకార్యక్రమాలను విసృతం చేసింది.

కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ పార్టి డా.స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జనవరి 18, సందర్భంగా, జనవరి 14, 2017 న జాబ్రియా బ్లడ్ బ్యాంకు సాయంత్రం 3 గంటలనుండి సాయంత్రం 5.30 నిముషముల వరకు రక్తదన శిబిరం నిర్వహిస్తోంది.

ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టీ కువైట్, హైదరాబాద్  ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో ప్రతి సంవత్సరం డా.స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతులకి, జయంతులకి బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఇండియన్ డాక్టర్స్ ఫోరం ప్రెసిడెంట్ డా పట్వారి కువైట్ ఏమినేంట్ డాక్టర్ వీరు ప్రతి సంవత్సరం హెల్త్ గైడ్ కువైట్ హెల్త్ మినిస్టర్ ద్వారా విడుదల చేయిస్తూ అటు కువిటీలకి ఇటు ఇండియాన్స్ కి సమన్వయ కరత గా ఉంటూ మంచి ఆర్గనైజర్ గా గుర్తింపు పొందారు. ప్రవాసాంధ్ర తెలుగు దేశం కువైట్ తాము నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరానికి డాక్టర్ పట్వారి ని ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ పట్వారి ముఖ్య అతిధి గా విచ్సుయడమే కాకుండా వారు కూడా రక్త దానం చేస్తున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ కోడూరి తెలిపారు.

కార్యక్రమానికి గౌరవనీయ అతిధి గా ఇండియన్ ఎంబసీ శ్రీ సునీల్ జైన్ హాజరు అవుతున్నారు.

ఈ సందర్భంగా కువైట్ లోని వారందరికీ ప్రవాసాంద్ర తెలుగు దేశం కువైట్ ప్రెసిడెంట్ శ్రీ ఎం. సుబ్బారాయుడుగారు, వర్కిగ్న్ ప్రెసిడెంట్ వెంట కోడూరి గారు మరియు కమిటి సభ్యులు , వారు

రక్త దాన శిబిరానికి విచ్చేసి ఎంటిఆర్‌కు నివాళిగా రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని ఆహ్వానం పలుకుతున్నారు.

ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టి కువైట్ నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరానికి అశేషంగా ప్రజలు విచ్చేసి రక్తదానం చేసి స్వర్గీయ ఎన్టీర్ గారికి నివాళులు అర్పించాలని ఆశిస్తూ డా.స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి కువైట్ ఎన్నారైస్ ఘన నివాళీ మరియు ప్రవాసాంధ్ర తెలుగు దేశం పార్టి కువైట్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ మరియూ కమిటీ సభ్యులకి అభినందనలు తెలియజేసుకుంటోంది.


   రక్తదాన శిబిరం, blood donation, donate blood, save lives, ntr blood donation camp