'నీ తలపుల వనము'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

'నీ తలపుల వనము'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Thu Jan 12, 2017 10:12        Rachanalu (రచనలు), Telugu

నీవు రాక ఈ కన్నులు మూతపడవు బంగారూ..!
నీవులేని గాలులేవి రుచియించవు బంగారూ..!

అన్నమేదొ సున్నమేదొ..ఆకలసలు లేదు కదా..!
ఎవ్వరేమి అనేసినా చెవిన పడవు బంగారూ..!

తోటలోని మొక్కలన్ని మొగ్గతొడిగి ఆగాయిగ..
నీ నవ్వుల వానలేక పుష్పించవు బంగారూ..!

చెలిమి గాక మరే ఆశ లేని మనసు ఇదుగిదుగో..
నువు చూడక గుండెలయలు తోడుపడవు బంగారూ..!

కథలు లేవు కలలు లేవు..నీ తలపుల వనము తప్ప..
ఈ తియ్యని వలపులసలు దిగులు పడవు బంగారూ..!

మాధవుడా అభావమున అల్లుకునే మల్లియనే..
అనురాగపు పరిమళాలు..కలహించవు బంగారూ..!

 

- మాధవరావు కొరుప్రోలు


   వనము,కథలు ,లేవు, కలలు,వలపులసలు,చెవి