' బ్రహ్మర్షి పత్రికి జేజేలు..!'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

' బ్రహ్మర్షి పత్రికి జేజేలు..!'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Wed Jan 11, 2017 15:07        Rachanalu (రచనలు), Telugu

పుట్టక పుట్టక పుట్టిన బ్రహ్మర్షి పత్రికి జేజేలు..!
పుట్టువ గుట్టులు పంచిన బ్రహ్మర్షి పత్రికి జేజేలు..!

ఆరోగ్యానికి శ్వాసయె మందని చాటెను సూటిగ..
ధ్యానం పట్టును చూపిన బ్రహ్మర్షి పత్రికి జేజేలు..!

మనసును శుభ్రం చేసే కాంతిని పట్టగ నేర్పెను..
పిరమిడ్ శక్తిని చాటిన బ్రహ్మర్షి పత్రికి జేజేలు..!

వర్తమానమున హాయిగ బ్రతుకుట సాధ్యము చేసెనె..
మైత్రీ వేణువు పట్టిన బ్రహ్మర్షి పత్రికి జేజేలు..!

మందుమాకులతొ పనియే లేదని నిరూపించె కద..
మౌనపు గగనం అయ్యిన బ్రహ్మర్షి పత్రికి జేజేలు..!

ఈశ్వర మాధవ తత్వపు అంచులు సకలం శ్వాసన..
సత్యం నేరుగ పలికిన బ్రహ్మర్షి పత్రికి జేజేలు..!!

 

- మాధవరావు కొరుప్రోలు


   బ్రహ్మర్షి, పత్రి, జేజేలు,పుట్టువ, గుట్టు,శ్వాస,పిరమిడ్ ,శక్తి,శుభ్రం,మైత్రీ, వేణువు,మందు,మాకు,ఈశ్వర, మాధవ,అంచులు, సకలం,సత్యం, నేరుగ