కువైట్ లో 'శ్రీ కృష్ణదేవరాయ ప్రవాసాంధ్ర కాపు బలిజ సేవా సంఘం' ఆత్మీయ సమావేశం

Header Banner

కువైట్ లో 'శ్రీ కృష్ణదేవరాయ ప్రవాసాంధ్ర కాపు బలిజ సేవా సంఘం' ఆత్మీయ సమావేశం

  Wed Jan 11, 2017 14:48        Associations, Telugu, Kuwait

కాపు అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా అగుపించే మున్నూరు కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు మరియు ఒంటరి మొదలైన ఉప-కులముల యొక్క సామాజిక వర్గాన్ని సూచిస్తుంది. తెలుగులో కాపు అనే పదానికి అర్ధం కర్షకుడు లేదా రక్షకుడు . వీరిని నాయుడు అనే పేరుతో కూడా పిలుస్తారు, అనగా నాయకుడు అని కూడా అర్ధం ఉంది. అదే నాయకత్వ లక్షణాలతో కువైట్ లో ప్రతీ తెలుగు వారికీ దగ్గరవుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలని చేపట్టి వారి కష్టాలకి "మేమున్నాం" అని భరోసా ఇచ్చిన సంఘం శ్రీ కృష్ణదేవరాయ ప్రవాస కాపు బలిజ సేవా సంఘం కువైట్. కులం అనేది కేవలం పేరుకు మాత్రమే.. కువైట్ లోనే తెలుగుప్రవాసులందరూ మాకు ఆత్మీయులే అంటారు అధ్యక్షులు జిలకర మురళీబాబు రాయల్.


ఆ అత్మీయతతోనే మీ అందరికీ సాదర ఆహ్వానం అంటూ సంక్రాంతి సందర్భంగా శ్రీ కృష్ణదేవరాయ ప్రవాస కాపు బలిజ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. కాపు బలిజ వారికి సేవ చేయాలని అన్న సంకల్పంతో కేవలం వీరికే కాక కువైట్ లోని తెలుగువారికి అందరికి సేవ చేయాలని అనే దృక్పధంతో మా కమునిటీ తరుపున మా సేవలని విస్తరించాలనే నేపధ్యంలో దాదపుగా కొత్తగా ఒక పది మందిని ప్రధాన కమ్యునిటీలో చేర్చుకోడం జరిగింది. స్పోర్ట్ కార్యదర్శిగా, యుత్ ప్రసిడెంట్ గా,   కాపు వెల్ఫేర్ర్ గా   కాపు ఉపకార్యదర్శి గా మరికొంతమందిని ప్రధాన కార్యదర్శులుగా తీసుకోడం జరుగుతుంది. ఈ కార్యక్రమం శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి ఉమేరియాలో ఫర్వానియాలో జరపబడును. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాపు బలిజ వారు మాత్రమే కాక కువైట్ లోని తెలుగు వారందరికీ సాదర ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నూతన ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున అందరు హాజరయి జయప్రదం చేయాలని, ప్రమాణ స్వీకారం తరువాత విందుభోజనం స్వీకరించి తెలుగు వారికి సేవ చేయాలనే ంఆశయాన్ని ప్రోత్సహించాలని అధ్యక్షులు జీలకర మురళీ రాయల్ గారి ఆకాంక్ష, ప్రత్యెక ఆహ్వానం. 

ప్రవాస కాపు బలిజ ఆత్మీయ సమావేశం అశేష ప్రజానీక సమక్ష్యంలో విజయవంతం కావాలని ఆశిస్తూ కువైట్ లోని తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తోంది కువైట్ ఎన్నారైస్.   sankranthi in kuwait, kuwait pongal programs, kuwait assocation programs