కువైట్ లో తెలుగు కళా సమితి సంక్రాంతి సంబరాలు

Header Banner

కువైట్ లో తెలుగు కళా సమితి సంక్రాంతి సంబరాలు

  Wed Jan 11, 2017 12:51        Associations, Exclusives, Kuwait, Telugu

1979-80 ప్రాంతాలలో కొంతమంది తెలుగు కుటుంబాలు సమావేశమై సాంస్కృతిక అంశాలను గురించి చర్చించుకొని ఒక సంస్థను నెలకొల్పాలని తీర్మానించారు. కాని అది సాకారం కావడానికి తొమ్మిదేళ్ళు పట్టింది. 1989లో లాభాపేక్షలేని సామాజిక, సాంస్కృతిక సంఘంగా కువైట్ తెలుగు కళాసమితి స్థాపించబడింది. ప్రతిష్ఠాత్మకంగా స్థాపించబడిన ఈ సంస్థ ఎటా తెలుగువారి సంప్రదాయాలను సంస్కృతులని కాపాడుతూ అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది.తెలుగు కళా సమితి గా పేరు గాంచిన పెద్ద సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ 2014 లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది, కువైట్లో తెలుగు వారందరిని ఒకచోటికి చేర్చి, వారి సమస్యలని తెలుసుకుని, వారి కష్టాలకి పరిష్కారాన్ని సూచించే సంస్థ.

కలలోనే చూడాలేమో!

హరిదాసు పాటతో పోటి పడుతోన్న కోకిల కిలకిలలు. గువ్వల గుసగుసలు

ఇంటి ముందు కొలువయిన గొబ్బెమ్మల ముచ్చట్లు .

నింగిపైని ఇంద్రధనుసును కిందకు దించిన ఇంటి ముందున రంగవల్లులు.

రేగి పండ్లతో అమ్మలు చేసే చంటి పిల్లల అభిషేకాలు.

కంటికెదురుకానీ! నేటి ఈ స్వప్నం. తిరిగి రానీ! మళ్లీ నాటి మన పల్లె సౌందర్యం,!

అని అనుకునే తరుణంలో ఇలలో కూడా చూడచ్చు అని పండుగ సంబరాలని, పల్లె పదాలని, చెక్క భజనల జానపదాలని, అచ్చమయిన, స్వఛ్చమయిన పట్టు పరికిణీ, 16 అణాల సౌందర్యలహరుల కోలాహలాన్ని అసలు మనం మన ఆంధ్ర దేశంలో మనపల్లెలో ఉన్నామా అన్నంతగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడానికి సన్నద్ధమవుతోంది తెలుగు కళా సమితి.అంబరాన్నంటే సంక్రాంతి సంబరాలు ఖైతాన్ కార్మెల్ స్కూల్ వేదికగా జవరై 13 వ తేదీన జరపడానికి తెలుగు కళాసమితి సన్నాహం చేస్తోంది. ఈ సంక్రాంతి కార్యక్రమాలను సంప్రదాయ గాన శిరోమణి, పేరడీ క్వీన్ శ్రీమతి అరుణా సుబ్బారావు గారు నిర్వహిస్తున్నారు. దీనికి గాను ఆమె 9 వ తారీఖునే కువైట్ చేరుకొని అక్కడి మహిళలకి శిక్షణ ఇస్తున్నారు సోమవారం, మంగళవారం బుధ గురు వారాల్లో కువైట్ లో మహిళలకి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు అరుణ గారు.

కార్యక్రమ వివరాలు ఉదయం 9 గంటలకు అచ్చ తెనుగు సంప్రదాయం చెక్కభజన, జాతరలు, తీర్దాలు లాంటి కార్యక్రమాలతో ప్రారంభం అవుతుంది సంక్రాంతి సంబరం . సంక్రాంతి పిండి వంటల పోటీ ఈ రెంటిలో వెంటనే విజేతలని ప్రకటించి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. 9.30 కి ముగ్గుల పోటీలు ముగ్గుల నిడివి 8X8 అడుగులకి మించకూడదు. ఒక గంట వ్యవధిలో వేయవలసి ఉంటుంది తరువాత సాంప్రదాయ సంక్రాంతి పిండి వంటల పోటీ ఈ రెంటిలో వెంటనే విజేతలని ప్రకటించి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది.

అటు పిమ్మట సంక్రాంతి సాంప్రదాయ వంటలతో షడ్రసోపెతమయిన భోజన కార్యక్రమం.

తరువాత అర్థ సంవత్సర సాధారణ సర్వ సభ్య సమావేశంతో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం ముగుస్తుంది.

పేరడీ క్వీన్ అరునగారి గురించి క్లుప్తంగా:

సంగీత దర్శకుడు మరియు సోదరుడు అయిన ఏ ఆర్ కే రాజుగారితో కలిసి లలిత సంగీత కచ్చేరీలు ఇచ్చారు. ఆ కచ్చేరీలలో వచ్చిన బహుమతులే తనకి స్ఫూర్తి అందుకే తన పాటల ప్రయాణం నిరాటంకంగా సాగింది అని అరుణ గారు ఆనందంగా పాడేస్తూ ఉంటారు స్టేజి మీద. తన పేరడీ పాటల ప్రష్టానం గురించి చెప్తూ తానూ ఒకటో తరగతిలో ఉన్నపుడు అక్కడ జరుగుతున్న జండా వందనం చూసి "నేను పాడతాను అని ఉత్సాహ పడ్డారట. అప్పుడు పాడమని మైక్ ఇస్తే "అమ్మ చూడాలి నిన్ను నాన్నని చూడాలి అన్న పాటని పాడారట అరుణగారు అప్పుడు ఆమెకి పలక బలపం కానుకుగా ఇచ్చారట ఉపాధ్యాయులు. అదే తన పాటల స్ఫూర్తి అంటారు అరుణ.

చెక్కభజన

రాయలసీమ లో - మరీ ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాల్లో - చెక్కభజన పాటలు చాలా ప్రాచుర్యం పొందాయి. ఇందులో భజన చెయ్యడానికి వాడే చెక్కలు పొడవుగా ఉండే పలకలను పోలి ఉండడం వల్ల చెక్కభజననే పలకల భజన అని కూడా అంటారు. చేతుల్లో మూరెడు పొడవుండే తాళపు చెక్కలతో, కాళ్ళకు గజ్జెలతో వలయాకారంలో తిరుగుతూ తాళపు చెక్కలు వాయిస్తూ తాళానికి అనుగుణంగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు. ఒకే చేతిలో రెండు చెక్కలను ఆడిస్తూ వాయించడం చెక్కభజనలోని సొగసు. వలయాకారంలో తిరిగే కళాకారులు కొన్ని సార్లు ఉద్దులు-వెలుద్దులుగా (జతలు జతలుగా) మారి ఎదురెదురుగా అడుగుమార్చి అడుగువేస్తూ ఉద్ది మార్చి ఉద్ది (ఒక అడుగులో ఒకవైపు-ఇంకొక అడుగులో రెండవవైపు) తిరుగుతూ నృత్యం చేస్తారు. పెన్నుద్దికాడైన గురువు పాటలోని ఒక్కొక్క చరణం అందిస్తే మిగిలిన వాళ్ళు అందుకుని పాడుతూ నృత్యం చేస్తారు. పలకల భజనలో జడకోపు తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం చెక్కభజనలో భక్తి, పౌరాణిక, శృంగార, హాస్య సంబంధమైన పాటలు వ్యాప్తిలో ఉన్నాయి.ఈ చెక్క భజనతో తెలుగు కళాసమితి సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. తరువాత జాతర కార్యక్రమం మొదలవుతుంది.

ఈ కార్యక్రమం తెలుగు కళా సమితి సభ్యులకి మాత్రమే

తెలుగు కళా సమితి నిర్వహిస్తున్న ఈ కార్యక్రం దిగ్విజయంగా సాగాలని తెలుగు కళాసమితి కార్యవర్గానికి, సభ్యులకి కువైట్ ఎన్నారైస్ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తోంది.

***


   sankranti celebrations, pongal celebrations in kuwait, harvest festival, kuwait pongal