'నీ పాటకు పల్లవిగా'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

'నీ పాటకు పల్లవిగా'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Wed Jan 11, 2017 12:15        Rachanalu (రచనలు), Telugu

ఎంత ప్రేమ చిరుగాలికి నా కురులతొ కులికేందుకు..!?
ఎంత ఇష్ట మీవెలుగుకు నా కనులతొ కులికేందుకు..!?

తాళలేని విరహాలా..తగవాడును దరిచేరగ..
ఎంత ఇంపు ఈ మల్లెకు నా మరులతొ కులికేందుకు..!?

మనువాడిన శ్వాసమాటు మధురోహల రాజ్యమేదొ..!?
ఎంత గొడవొ ఈ అగ్గిది..నా చెలులతొ కులికేందుకు..!?

నీ పాటకు పల్లవిగా మిగులుతలపె హాయి కదా..
ఎంత శాంతమీ నీటికి..నా ధ్వనులతొ కులికేందుకు..!?

వసంతాల పరువాలకు రెక్కలేల తొడిగేనో..!?
ఎంతమోహమీ మనసుకి..నా తరులతొ కులికేందుకు..!?

ఈ మాధవ గజల్ వెంట జాలువారు అక్షరమా..!
ఎంతపంతమీ తనువుకు..నా ఝరులతొ కులికేందుకు..!?

 

 

- మాధవరావు కొరుప్రోలు


   మల్లె,ఎంత, ఇంపు,నీటి,మిగులు,తలపె ,హాయి,ఝరుల,జాలువారు,తాళలేని ,పల్లవి