కువైట్ తెలుగు కళా సమితి సంక్రాంతి సంబరాలు - పేరడీ క్వీన్ అరుణ సుబ్బారావు గారి గురించి ప్రత్యేక కథనం

Header Banner

కువైట్ తెలుగు కళా సమితి సంక్రాంతి సంబరాలు - పేరడీ క్వీన్ అరుణ సుబ్బారావు గారి గురించి ప్రత్యేక కథనం

  Wed Jan 11, 2017 12:00        Associations, Exclusives, Kuwait, Telugu

నవరసాల్లో హాస్యానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆ హాస్యాన్ని పాటల్లో జొప్పించి హాస్యాన్ని రంగరించి పాడి పేరడీ గాయనిగా పేరు పొందారు అరుణ సుబ్బారావు గారు. అరుణ గారు పాడిన హాస్య పేరడీ పాటలు ఎంతోమంది ప్రశంసలు పొందాయి. సంక్రాంతి సందర్భంగా 13 వాతారీఖు కువైట్ లో జరగనున్న తెలుగు కళా సమితి - కువైట్ వారి కార్యక్రమానికి ముందుగా అక్కడి స్థానిక తెలుగుమహిళలని 50 పైగా తనతో పాటు పాడడానికి శిక్షణ ఇవ్వడానికని 9 వ తారీఖుకే కువైట్ చేరుకుని పాటల పేరడితో ఉత్సాహ పరుస్తూ వాతావారణాన్ని ఆహ్లాదపరుస్తున్న అరుణ గారి గురించి ఒక ప్రత్యెక కథనం మీ కువైట్ ఎన్నారైస్ లో.

ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే అంటూ ఒక ముసలి గొంతుతో పాడి నవ్విస్తారు ప్రేక్షకులను. ఆరేళ్ళ వయసులో తన తండ్రి, గురువు గారయిన ఏ ఆర్ రాజు గారు రాసిన బుర్రకథలను ప్రతిభావంతంగా ప్రదర్శించడంతో జానపదా కళారంగం లోకి అడుగుపెట్టారు అరుణ

సంగీత దర్శకుడు మరియు సోదరుడు అయిన ఏ ఆర్ కే రాజుగారితో కలిసి లలిత సంగీత కచ్చేరీలు ఇచ్చారు. ఆ కచ్చేరీలలో వచ్చిన బహుమతులే తనకి స్ఫూర్తి అందుకే తన పాటల ప్రయాణం నిరాటంకంగా సాగింది అని అరుణ గారు ఆనందంగా పాడేస్తూ ఉంటారు స్టేజి మీద. తన పేరడీ పాటల ప్రష్టానం గురించి చెప్తూ తానూ ఒకటో తరగతిలో ఉన్నపుడు అక్కడ జరుగుతున్న జండా వందనం చూసి "నేను పాడతాను అని ఉత్సాహ పడ్డారట. అప్పుడు పాడమని మైక్ ఇస్తే "అమ్మ చూడాలి నిన్ను నాన్నని చూడాలి అన్న పాటని పాడారట అరుణగారు అప్పుడు ఆమెకి పలక బలపం కానుకుగా ఇచ్చారట ఉపాధ్యాయులు. అదే తన పాటల స్ఫూర్తి అంటారు అరుణ.

ఇక పేరడీ పాటలు ఇంట్లో సరదాగా తండ్రి సోదరునితో మాట్లాడుతూ పాటలు పేరడీ కట్టీ పాడుతూ ఉండడం అలా పేరడీ బాగా అలవాటయింది అంటారు అరుణ.

ట్రాఫిక్ ఏమో బారెడు ఉంటది

వెళ్లేదారి చారెడు ఉంటది

ట్రాఫిక్ లోన చిక్కుకుపోతే లాఫింగ్ మర్చిపోతావు

హైదరాబాదు నగరం చూడు రాజాలింగో రాజలింగ 

అతుకుల బతుకుల రోడ్లని  చూడు   శివాశంబు లింగా

అంటూ సరదాగా పాడేస్తారు. అందులో హాస్యంతో పాటు అంతర్లీనంగా సందేశం కూడా ఉంటుంది. పాటలు చాలామంది పాడతారు. సంగీతం అందరూ నేర్చుకుంటారు కాని సన్నివేశం ఎలాంటిదైనా పదాల అల్లికతో పాటలు పాడేయగల దిట్ట..పేరడీ పాటల్లో పేరడీ క్వీన్ అరుణా సుబ్బారావు. సందర్భాణానికి అనుగుణంగా క్షణాల్లో పాటలు రాసి వెంటనే ట్యూన్ చేసి గానం చేయడం ఒక ప్రత్యేక కళ. అలాంటి కళను అలవోకగా ప్రదర్శిస్తున్నారు అరుణ గారు జానపదం నుండి పెరడిలోకి వచ్చారు తనకంటూ ప్రత్యేకత ఉండాలి అని. బాధలోంచే పేరడీ పుడుతుందని అంటారు అరుణ. హైదరాబాదులో బస్సులు స్టాప్ లో ఆగవు అని చెప్పడానికి ... పేరడీ చూడండి

 

హైదరాబాదు బస్సు

ఇది ఎప్పుడు చూసిన రష్

ఇది స్టాప్ లో ఆగదు తుస్

పరిగేట్టకపోతే మిస్సు

జింతాత జిత జిత జింతాతా

 

తను పేరడీ పాటల్లోకి రావడానికి తండ్రి గారు, చొక్కపు వెంకటరమణ గారి ప్రోత్సహం ఉందంటారు అరుణ. జానపదాలు, సంగీతం అందరూ పడతారు పెరడిలో అందులో మహిళలు ఎవరు లేరని ఇందొక వృత్తిగా, ప్రవృత్తిగా చేసుకోమన్న వీరిద్దరి ప్రోత్సాహమే ఈ పేరడీ క్వీన్ గా నిలిపింది అంటారు అరుణ.

 

రావమ్మా మా పేటకి ఇంటికి దోమా

చోటున్నది నీకు సూటవుతది

నీకు దాహమయితే వేడి వేడి బ్లడ్ ఉన్నది

నీకు ఆకలయితే రాత్రి మిగులు ఫుడ్ ఉన్నది

నీకు నజుకోను పాచి కంపు పప్పున్నది

నువ్వు తిరగాడానికి మున్సిపాలిటి పెంట ఉన్నది

రావమ్మా మా పేటకి ఇంటికి దోమా

చోటున్నది నీకు సూటవుతది

నువ్వు నిలుచుంటే చెత్తకుండి నీడున్నది

నువ్వు కూర్చుంటే కుళ్ళు కాల్వ గట్టున్నది

నువ్వు పడుకుంటే పెంటదిబ్బ పడకున్నది

రావమ్మా మా పేటకి ఇంటికి దోమా

చోటున్నది నీకు సూటవుతది

అంటూ చెత్త పెరుకుపోవదాన్ని పర్యావరణ పరి రక్షణని ఈ పాట ద్వారా హెచ్చరిస్తున్నారు.

పటాన్ చేరు  రామచంద్రాపురం దగ్గర మొట్టమొదటి సారిగా తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు బుర్ర కథ చెప్పమని అరుణని తీసుకువెళ్ళారు. అక్కడ స్టేజ్ మీద ఎన్టీఆర్ పాటలు పాడుతున్నాది. ఆయన స్టేజి పైకి వచ్చేసమయానికి

"ఏ తల్లీ నిను కన్నదో

నేను నీ తల్లిని అయినానురా..

నేను నీ తల్లిని అయినానురా..

నా వారాల తోలిపంటగా

నీవు నా ఇంట వేలిసావురా...

నా ఇంట వేలిసావురా

అని పాడుతున్నాను. అది విన్న ఎన్టీఆర్ గారు స్టేజ్ పైకి వచ్చి ఏరి ఆ తల్లి అని అడిగారు అప్పుడు నేను చాలా చిన్నదాన్ని.నా పుట్టినరోజుకి మా పాపకి బట్టలు తీసుకోవాలి అని ఒక పట్టులంగా జాకెట్ కొని కుట్టించి పంపించేవారు నాకు.అలా నన్ను తన సొంత కూతురిలా/తల్లిలా  నాకు ఇంత పెద్ద తల్లి ఉందా అని మెచ్చుకున్నారుట ఎన్టీఆర్ గారు.  అలా ఎన్టీఆర్ గారి ప్రోత్సహం తో 8 సంవత్సారాలు పల్లెపల్లెకి తిరిగి పాటలు పాడారట అరుణగారు.

అరుణ గారు కువైట్ లో ప్రదర్శన ఇది రెండో సారి. తన పెరదీలతో తెలుగు కళా సమితి కువైట్ సభ్యులను  ఆహ్లదపరిచి సంక్రాంతి సంబరాలని హాస్య పెరడీలతో అలరించాలని ఆశిస్తూ... పేరడీ క్వీన్ అరుణ గారికి , మరియు తెలుగు కళా సమితి కువైట్ సభ్యులకు, కువైట్ ఎన్నారైస్ సంక్రాత్రి శుభాకాంక్షలు మరియు అభినందనలు.

 

గమనిక : ఈ కార్యక్రమము  తెలుగు కళా సమితి కువైట్ సభ్యులకు మాత్రమేనని అధ్యక్షులు శ్రీ స్వామి గారు ఒక ప్రకటనలో తెలిపారు.

 

 


   parody queen, tks program, parody in kuwait