'కనువిప్పే కలిగిందా'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

'కనువిప్పే కలిగిందా'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Wed Jan 11, 2017 10:54        Rachanalu (రచనలు), Telugu

కోట్లుకోట్లు డబ్బుంటే..వెంటరాదు తెలిసిందా..!
అధికారం నీదైతే..నిద్రరాదు తెలిసిందా..!

వెక్కిరించు నోట్లయుగం కాలి బూడిదవ్వాలిక..!
కానిదాన్ని చేరదీస్తె..కదలరాదు తెలిసిందా..!

పడిపోయే రూపాయే పకపకమని నవ్వేనే..!
దానివెంట పరిగెడితే..నిలువరాదు తెలిసిందా..!

ఓదార్చే వారి కొరకు వెతుకులాట వృథా కదా..!
సానుభూతి మెతుకులు తిని..బ్రతుకరాదు తెలిసిందా..!

శాంతి కొరకు విప్లవించు శంఖమంటె నీ హృదయం..!
యుద్ధభేరి మ్రోగిందా.. ఆగరాదు తెలిసిందా..!

పెనునిద్దుర వీడాలిక తక్షణమే మాధవుడా..!
కనువిప్పే కలిగిందా..చెప్పరాదు తెలిసిందా..!

 

 

- మాధవరావు కొరుప్రోలు


   కోట్లు ,వీడాలి,సానుభూతి, మెతుకులు ,వృథా,నోట్ల,యుగం, కాలి, బూడిద,డబ్బు