'నీకోసం యుగాలుగా వేచానే'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

'నీకోసం యుగాలుగా వేచానే'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Wed Jan 11, 2017 10:00        Rachanalu (రచనలు), Telugu

ప్రేమలేఖ వ్రాయలేక అయ్యానే గగనంలా..!
గుండెలయల మౌనాలను కురిసానే మేఘంలా..!

అందాలకు అందాన్నే దిద్దాలని చూడటమా..
నా హృదయపు కోవెలలో నిలిపానే దీపంలా..!

పోటీపడు అక్షరాల వెల్లువలో నేనెక్కడ..
గాలి అలల ఊసులలో కదిలానే గీతంలా..!

మాటకారి కాటుకతో చెలిమి కుదిరె మధురంగా..
చీకటికే పాట నేర్ప మిగిలానే రాగంలా..!

భాషలేని చోటేదో చూపగల్గు నెరజాణా..
భా'వనకే అందకుండ వెలిగానే వేదంలా..!

ఈ మాధవ గజల్ రాణి నీవేనని చెప్పాలా..
నీకోసం యుగాలుగా వేచానే శిల్పంలా..!!

 

-  మాధవరావు కొరుప్రోలు


   మేఘం,నేర్ప ,రాగం,నెరజాణ,భాష,మాటకారి ,కాటుక,శిల్పం,ప్రేమలేఖ,మధురం,యుగాలు