'నీ కబురులె కావ్యాలై'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

Header Banner

'నీ కబురులె కావ్యాలై'... గజల్ | మాధవరావు కొరుప్రోలు

  Tue Jan 10, 2017 16:30        Rachanalu (రచనలు), Telugu

చిరునవ్వుల పూలతోట వాడనీకు ఎపుడైనా..!

తలపులోన ఎండమావి చేరనీకు ఎపుడైనా..!

 

అమృతమేదొ తెలియదుగా ఎటులుండునొ నీ వాకిట..!?

పలుకుతేనె తెలుగుగుడిని చెదరనీకు ఎపుడైనా..!

 

ఎన్ని కథలు చెబుతాయో నీ అడుగులు..!?

మన సంస్కృతి అద్దం మసిబారనీకు ఎపుడైనా..!

 

నీ కబురులె కావ్యాలై దిగంతాలు ఏలాలిక..

మనవేదిక తిలకమసలు కరగనీకు ఎపుడైనా..!

 

కులము మతము ప్రాంతాలతొ పని ఉందా..

చెలిమివీణ రాగాలను అలుగనీకు ఎపుడైనా..!

 

మాధవుడా..గజలువీధి తిరుగాడే మాంత్రికుడా..!

అక్షరాల మౌనాలను తరగనీకు ఎపుడైనా..! 

 

 

- మాధవరావు కొరుప్రోలు


   పూలతోట,తెలుగు,గుడి,అడుగులు,దిగంతాలు ,ఏలాలి,తిలకమసలు,మన,వేదిక ,