కువైట్ వాసులకు ఆరోగ్య శాఖ హెచ్చరిక! భారీ మూల్యం

Header Banner

కువైట్ వాసులకు ఆరోగ్య శాఖ హెచ్చరిక! భారీ మూల్యం

  Sat Jan 07, 2017 11:10        Health, Kuwait, Telugu

మహమ్మద్ అల్ జబ్రి మునిసిపల్ మినిస్టర్ ఆహారం, ఉత్పత్తి వాడకాలు  కలుషితం కాకుండా చూసుకోమని వ్యాపారులకు సూచన ఇచ్చారు.

మంత్రి తాజాగా చేపట్టిన తనిఖీలలో కలుషిత వస్తువుఅలని 34.5 టన్స్ నిర్వీర్యం చేసారు. 8 గ్రోసరీ స్టోర్స్, ౬౮ ఇతర స్టోర్స్ కలుషిత ఆహరం విక్రయిస్తున్నందుకు గాను మూసివేయించారు. ఈ నేపధ్యంలో మంత్రి కలుషిత ఆహరం విక్రయిస్తే భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు.

కలుషిత ఆహారం గురించి ఒక అవగాహన:

కలుషిత ఆహారం, కలుషిత నీరు మూలంగా దాదాపు అందరూ జీవితంలో ఎప్పుడో అప్పుడు జబ్బు పడినవాళ్లే అంటే అతిశయోక్తి కాదు. మనకు శక్తిని ప్రసాదించే అమృత తుల్యమైన ఆహారం.. బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవులు, విషతుల్యాలు, రసాయనాల వంటి వాటితో కలుషితం కాకుండా చూసుకోవటం ఎంత అవసరమో అనటానికి ఇదే నిదర్శనం. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా 'పొలం నుంచి పళ్లెం వరకు ఆహారం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి' అని నినదించింది. ఉత్పత్తి నుంచి రవాణా వరకు.. తయారీ నుంచి వినియోగం వరకు.. అన్ని సందర్భాల్లోనూ ఆహారం కలుషితం కాకుండా, చెడిపోకుండా అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరముందని నొక్కి చెబుతోంది. ఒకప్పుడు ఎక్కడి పదార్థాలు అక్కడికే పరిమితమయ్యేవి. కానీ ప్రపంచం ఏకీకృతమవుతూ, వాణిజ్యం దేశాల ఎల్లలు దాటి ప్రపంచం మొత్తానికి విస్తరించిన నేపథ్యంలో.. ఆహార పదార్థాలు పొలం నుంచి పళ్లానికి చేరుకునే ప్రక్రియ గత 50 ఏళ్లుగా గణనీయంగా మారిపోయింది. ఒక చోట ఆహార పదార్థాలు కలుషితమైతే అది అక్కడితోనే ఆగిపోవటం లేదు. నిమిషాలు, గంటల్లోనే ఇతర ప్రాంతాలకూ శరవేగంగా విస్తరిస్తోంది. అందువల్ల ఆహారాన్ని ఉత్తత్తి చేసేవాళ్లే కాదు ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా సురక్షితమైన పద్ధతులను పాటించటం తప్పనిసరైంది. కాబట్టి ఆహార సురక్షితకు సంబంధించిన కొన్ని నిజానిజాలను తెలుసుకోవటం అవసరం.ఆహారం ద్వారా 200కు పైగా జబ్బులు వ్యాపించే అవకాశముంది. చెడిపోయిన, సురక్షితం కాని ఆహారాన్ని తినటం వల్ల.. ఒక్క నీళ్లవిరేచనాలు- డయేరియా- మూలంగానే ఏటా 15 లక్షల మంది చనిపోతున్నారని అంచనా. ఆహారాన్ని వండటం, నిల్వ చేయటంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి మరణాలను గణనీయంగా నివారించుకోవచ్చు.కలుషిత ఆహారం వల్ల తలెత్తే దుష్ప్రభావాలు దీర్ఘకాల అనారోగ్య సమస్యలకూ దారితీయొచ్చు. ఆహారం కలుషితం కావటంతో వచ్చే జబ్బుల్లో కడుపు నొప్పి, వాంతి, విరేచనాల వంటి లక్షణాలు తరచుగా కనిపిస్తుంటాయి. కానీ భారీ లోహాలు లేదా సహజంగా తలెత్తే విషతుల్యాలతో పదార్థాలు కలుషితమైతే క్యాన్సర్‌, నాడీ సమస్యల వంటి దీర్ఘకాల జబ్బులకూ దారితీయొచ్చు.కలుషిత ఆహార సంబంధ ఇన్‌ఫెక్షన్లు పేదలు, జబ్బులతో బాధపడే వారిలో మరింత ఎక్కువ. వీరిలో జబ్బులు త్వరగా తీవ్రం కావటమే కాదు.. మరణానికీ దారితీయొచ్చు. చిన్న పిల్లలు, గర్భిణులు, జబ్బులతో బాధపడేవారు, వృద్ధుల్లో వీటి ప్రభావం మరింత ఎక్కువ.ప్రస్తుతం ఆహారం పంపిణీ వ్యవస్థ సంక్లిష్టంగా మారిపోయింది. మనం తినటానికి ముందు పండించటం, కోయటం, శుద్ధి చేయటం, నిల్వ చేయటం, రవాణా, పంపిణీ.. ఇలా వివిధ దశలను దాటుకొని రావాల్సి ఉంటుంది. ఈ దశల్లో ఎక్కడైనా ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశముంది.యాంటీబయోటిక్‌ మందులకు లొంగని బ్యాక్టీరియా నానాటికీ పెరుగుతుండటం పెద్ద సమస్య. ఇందుకు ఆహార పదార్థాలు కూడా దోహదం చేస్తున్నాయి. వ్యవసాయం, పశు పెంపకంలో మితిమీరిన సూక్ష్మక్రిమి నాశకాల వాడకం సూక్ష్మక్రిములు మొండిగా తయారుకావటానికి దోహదం చేస్తోంది. జంతువుల్లోని మొండి బ్యాక్టీరియా మనుషులకూ వ్యాపించే అవకాశముంది.ఆహారాన్ని సురక్షితంగా ఉంచుకోవటమన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రభుత్వాలు, పరిశ్రమలు, ఉత్పత్తి దారులు, విద్యాలయాలు, వినియోగదారులు.. ఇలా అందరూ కృషి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది.ఆహార భద్రత పద్ధతులపై వినియోగదారులు అవగాహన పెంచుకోవాలి. ప్రభుత్వాలు, సంస్థలు ప్రజలకు పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా చూడాలి. ఆహారం మూలంగా వచ్చే జబ్బులు, పదార్థాలు చెడిపోకుండా చూసుకునే విధానాలు, ప్యాకెట్లపై ముద్రించే సమాచారాన్ని అర్థం చేసుకోవటం వంటి వాటిపై పూర్తి అవగాహన కల్పించాలి.


   health ministry, warning for nris, effected food