కువైట్ లో జబర్దస్త్ హంగామా చారిటీ షో

Header Banner

కువైట్ లో జబర్దస్త్ హంగామా చారిటీ షో

  Fri Jan 06, 2017 11:51        Associations, Helping Hand, Kuwait, Telugu

కువైట్ లో కువైట్ ఫ్యూషన్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో జబర్ధస్త్ హంగామా చారిటీ షో 2017 సాంస్కృతిక కార్యక్రమం జనవరి 27 న మెక్ డోనాల్డ్ దగ్గర ఖైతాన్ ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ ప్రాంగణంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో డాన్స్, మిమిక్రీ పాటలు ప్రముఖంగా ఉంటాయి.

ఈ కార్యక్రమానికి జబర్దస్త్ టీం హైపర్ ఆదీ; రాకింగ్ రాకేష్; గెటప్ శ్రీను, ప్రముఖ సింగర్ మరియు యాంకర్ హర్షిత; తెలంగాణ మూవీ మరి టెలివిజన్ ఆర్టిస్ట్ ప్రెసిడెంట్ శ్రీ శివ (అపురూప్) హాజరయి తమ కళలతో ప్రేక్షకులని అలరించనున్నారు.

ఈ కార్యక్రమానికి గోల్డెన్ స్పాన్సర్ గా టి వి ఎస్ ట్రావెల్స్

డైమాండ్ స్పాన్సర్ గా చేజెర్ల ఇంద్రకుమార్ రాజు,

సిల్వర్ స్పాన్సర్ గా గోల్డెన్ ఆరో వారు వ్యవహరిస్తున్నారు.

ఇంకా ఈ కార్యక్రమానికి లులు ఎక్స్చేంజ్, స్కై నెట్ , హోటల్ సురేష్ రెసిడెన్స్ తిరుపతి, టీ, మా ఛాలెంజర్స్ తిదితర సంష్తలు సహాయసహకారాలని అందిస్తున్నారు.

కార్యక్రమ తదితర వివరాలకి సంప్రదించవలసిన నంబర్లు:99424773;67661540-99691042;60620441

ముఖ్యంగా ఈ షో ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయాన్ని అనాధలకు, వికలాంగులకు, పేదవారికి అందజేస్తామని కార్యక్రమ నిర్వహకులు ఇమ్రాన్, వేణు, కుమార్ మరియు షంషేర్ గార్లు తెలిపారు.

ఫ్యూషన్ డాన్స్ అకాడమీ కువైట్ వారు ఒక సత్సంకల్పంతో తలపెట్టిన ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది మన  kuwaitnris.com 

ఈ కార్యక్రమ మీడియా పార్టనర్ kuwaitnris.com వ్యవహరిస్తోంది.

 

 


   fusion dance academy, kuwait charity show, charity shows, reality shows, hangama in kuwait