కువైట్ లో వైయస్ఆర్ సీపీ సహాకారంతో స్వస్ధలం చేరిన మృత దేహాలు 

Header Banner

కువైట్ లో వైయస్ఆర్ సీపీ సహాకారంతో స్వస్ధలం చేరిన మృత దేహాలు 

  Fri Dec 30, 2016 16:30        Associations, Helping Hand, Kuwait, Telugu

కువైట్: వివరాలకు వెళితే రైల్వే కోడూరు రాఘవరాజపురం కు చెందిన లింగాల రాజాగోపాల్ రెడ్డి గత 10 సం: నుండి కువైట్ లో ఉంటున్నారు భార్య ఒక పాప బాబు ఉన్నారు 24 - 12 - 16న గుండె పోటుతో మరణించారు మరియు కడప పాలెంపల్లి చెందిన తలమల్ల రమాదేవి గత 6 సం: నుండి ఉంటున్నారు రమాదేవి గారు కూడా గుండె పోటుతో 20 - 12 - 16న మరణించారు. 

ఈ విషయాన్ని వారి బంధువులు వైయస్ఆర్ సీపీ కువైట్ కన్వీనర్ యం. బాలిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లగా కమిటీ సేవాదళ్ సభ్యులు గోవిందు రాజు, కె .నాగ సుబ్బారెడ్డి, భారత రాయబార కార్యాలయం ద్వారా మరియు కువైట్ ఇమిగ్రేషన్ పనులన్ని పూర్తీ చేయడమే గాక భారతరాయబారకార్యాలయం అధికారులతో మాట్లాడి ఉచితంగా ఇద్దరికి విమాన టికెట్ ఇప్పించడం జరిగింది. ఎల్.  రాజాగోపాల్ రెడ్డి గారి మృతదేహాం చెన్నై నుండి స్వస్ధాలం వరకు ఉచితంగా అంబులెన్స్ ను రాజంపేట పార్లమెంట్ సభ్యులు పి. మిధున్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. టి. రమాదేవి మృతదేహాం కొరకు బంధువులు వాహనం  సమకూర్చారు. 

ఈ సందర్భముగా గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, యం. బాలిరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మృతదేహాన్ని ఇండియాకు పంపాలంటే విమాన టికెట్, శవపేటిక కలిసి 75 వేలు ఖర్చు వస్తాది, ఈ ఖర్చును భారత రాయబార కార్యాలయం భరించింది. భారత రాయబార కార్యాలయం అధికారులకు, ఎం. పి. మిధున్ రెడ్డి గారికి వై.యస్.ఆర్. సీపీ కువైట్ సేవాదళ్ సభ్యులకు కమిటి సభ్యుల తరపున ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. 

సభ ఆసుపత్రిలో ఉన్న మర్చూరిలో కో-కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి.నరసా రెడ్డి, సభ్యులు లాజరస్, పులపుత్తూర్ సురేష్ రెడ్డి, గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, గోవిందు రాజు, కె. సుబ్బారెడ్డి, మరియు కడప శీను, అల్లాబకాష్ తదితరులు రాజాగోపాల్ రెడ్డి, రమాదేవి భౌతికాయాన్ని సందర్షించి ఘనంగా నివాళీలు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తమ ప్రఘాడ సానుభూతి తెలిపారు. 

నోట్:  మృతదేహాలు కువైట్ కాలమాన ప్రకారం 29 - 12 -16న రాత్రి బయలుదేరి చెన్నై 30-12-16న ఉదయం 5 గం: చేరింది



   ysrcp kuwait, dead bodies, ambulance, mortuary