ఒక్క నెలలో 6 కిలోల బరువు తగ్గించే సింపుల్ ఫుడ్స్ ఇవే

Header Banner

ఒక్క నెలలో 6 కిలోల బరువు తగ్గించే సింపుల్ ఫుడ్స్ ఇవే

  Tue Dec 27, 2016 12:12        Health, Telugu

అధిక బరువు ఉన్న వారిలో బరువు తగ్గించుకోవడమనేది ఫ్రస్టేటింగ్ విషయం. ఎక్కువ బరువున్నామన్న ఆలోచనలు చాలా మందిలో కలవరపెడుతాయి. అయితే ఆ ఆలోచనలకు తావివ్వకుండా కొన్ని సూపర్ ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.వేగంగా...నేచురల్ గా బరువు తగ్గిస్తాయి? యస్ ! ఖచ్చితంగా ఇది నిజం!బరువు పెరగడానికి ప్రధాన కారణం ఆహారాలు; అదే విధంగా హెల్తీ ఫుడ్స్ ను సరైన మోతాదులో, తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వు పదార్థాలు, షుగర్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.!

అధిక బరువుతో ఉండం లేదా ఊబకాయం ఉండటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం. బరువు పెరగడం వల్ల అనేక వ్యాధులకు మూలాధారం. ఆరోగ్య సమస్యలే కాదు, ఓవర్ వెయిట్ వల్ల అనారోగ్యకారంగా, కాన్పిడెన్స్ లెవల్స్ తగ్గిపోతాయి. అందవిహీనంగా కనబడుతారు. అందువల్ల హెల్తీ వెయిట్ ను మెయింటైన్ చేయాలన్నా, హెల్తీ ఫిజిక్ తో కనబడాలన్నా, వెంటనే ఈ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. వీటితో పాటు రెగ్యులర్ వ్యాయామాలు చేయడం చాలా అవసరం. ఈ క్రింది సూచించిన సూపర్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఒక్క నెలలో 6 కిలోల బరువు తగ్గించుకోవచ్చు. మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

గుడ్డు : ఆర్గానిక్ గుడ్డును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరంలో ప్రోటీన్స్ ను క్రమబద్దం చేస్తుంది. ఫ్యాట్ సెల్స్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. దాంతో వేగంగా బరువు తగ్గించుకోవచ్చు.

ఆకుకూరలు: బరువు తగ్గించుకోవడానికి మరో హెల్తీ సూపర్ ఫుడ్ ఆకుకూరలు. ఇది బాడీ మెటబాలిక్ రేటును పెంచుతుంది. శరీరం మొత్తాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

చేపలు: చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల వేగంగా ఫ్యాట్ సెల్స్ ను కరిగిస్తాయి . దాంతో వేగంగా బరువు తగ్గుతారు.

కాలీఫ్లవర్ : ఈ వెజిటేబుల్ సులభంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ లో ఫైబర్ , ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల, ఈ రెండు పదార్థాలు శరీరంలో ఫ్యాట్ సెల్స్ తో పోరాడి, కొవ్వు కరిగించి, వేగంగా బరువు తగ్గిస్తాయి.

బ్రొకోలీ: బ్రొకోలీ క్రూసిఫెరస్ ఫ్యామిలికి చెందినది. ఇందులో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది ఫ్యాట్ సెల్స్ శరీరంలో చేరకుండా సహాయపడుతుంది. దాంతో అధిక బరువు పెరగకుండా, ఉన్న బరువును తగ్గిస్తాయి.

లీన్ బీఫ్ : ఆర్గానిక్ లీన్ బీఫ్ తినడం వల్ల, వ్యాయామం లేకుండా రోజుకు 100 క్యాలరీలను కరిగిస్తుంది. ఇందులో ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి.

చికెన్ బ్రెస్ట్ : లీన్ చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల, ఆయిల్, గ్రేవీగా కాకుండే ఫ్రైడ్ లేదా బేక్డ్ చికెన్ బ్రెస్ట్ తినడం వల్ల హెల్తీ మజిల్ మాస్ ఏర్పడుతుంది. కొన్ని కిలోల బరువు తగ్గిస్తుంది.

బీన్స్ : బ్లాక్ బీన్స్, గ్రీన్ బీన్స్, రాజ్మా ఎలాంటి బీన్స్ అయినా సరే , రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మెటబాలిక్ రేటు పెరుగుతుంది. దాంతో బాడీలో ఎక్కువ క్యాలరీలను కరిగించుకోవచ్చు.

అవొకాడో : అవొకాడోలో ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి . ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎఫెక్టివ్ గా బాడీ ఫ్యాట్ ను కరిగిస్తాయి.


   చికెన్ బ్రెస్ట్, lean beef, brokoli, simple foods, weight loss menu