కువైట్ లో ఘనంగా క్రిస్మస్ జరుపుకున్న ప్రవాసులు

Header Banner

కువైట్ లో ఘనంగా క్రిస్మస్ జరుపుకున్న ప్రవాసులు

  Mon Dec 26, 2016 14:59        Devotional, Telugu, Kuwait

"క్రిస్మస్" క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది. యేసు జన్మించి ఇప్పటికి రెండు వేల సంవత్సరాలు దాటిపోయినా ఆయనను కరుణారస మూర్తిగా, దయామూర్తిగా నిత్యం ప్రార్థనలు చేస్తున్నారు భక్త జనులు. 

క్రిస్మస్ నాడు ప్రపంచవ్యాప్తంగా చర్చిలన్నీ భక్తులతో నిండిపోయాయి. కువైట్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కువైట్‌లోని మాల్వియా ఏరియాలోని చర్చిలో పెద్ద సంఖ్యలో తెలుగువారు ప్రార్థనలు జరిపారు. 1969లో నిర్మించిన ఈ చర్చికి కువైట్‌లోని మారుమూల ప్రాంతాల నుంచి కూడా వలస కూలీలు ప్రార్థనలు చేసేందుకు వస్తుంటారు. పాస్టర్లు డాక్టర్ లివింగ్‌స్టన్, కే. కుటుంబరావు.. ప్రభువు సందేశాన్ని వినిపించారు.    christmas christamas celebrations, christamas in kuwait