కువైట్ లో వైయస్సార్ సిపి సహాయంతో స్వస్థలం చేరిన తెలుగు ప్రవాసి మృతదేహం... మనస్ధాపం తో ఆత్మహత్య

Header Banner

కువైట్ లో వైయస్సార్ సిపి సహాయంతో స్వస్థలం చేరిన తెలుగు ప్రవాసి మృతదేహం... మనస్ధాపం తో ఆత్మహత్య

  Thu Dec 15, 2016 14:53        Associations, Helping Hand, Kuwait, Telugu

కువైట్: గల్ఫ్, కువైట్, కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్, యం. బాలిరెడ్డి గారు చెప్పిన వివరాల ప్రకారం రాయచోటి రామాపురం మండలం బాలిరెడ్డి గారి పల్లెకు చెందిన హెచ్. విరామోహన ఒక సం: ముందు ఇంటి పనికి కువైట్ వచ్చారు. 3 నెలల క్రితం తన భార్య చనిపోయింది ఆఖరి చూపు చూడాలని ఇండియాకు పంపమని కువైటీ (స్పాన్సర్) అడిగితె 2 సం: అగ్రిమెంట్ ఉంది 2 సం: తర్వాత పొమ్మని చెప్పడం ద్వారా ఇండియాకు పంపలేదని కువైటీ (స్పాన్సర్) ఇంటి నుండి పారిపోయి బంధుల దగ్గర చేరి ఇండియా పంపమని కోరగా పాస్ పోర్ట్ లేకుండా ఇండియా పోలేరు పాస్ పోర్ట్ తీసుకుకొని రమ్మంటే కువైటి దగ్గర పొతే  జైలుకు పంపుతాడని భయపడి ఇండియా కు పోలేని అని భార్యను కడసారి చూడలేక పోయాను అని మనస్ధాపం చెంది 06 - 12 - 16 న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

హెచ్. విరామోహన మృత దేహాన్ని ఇండియాకు పంపమని రాయచోటి శాసన సభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు బాలిరెడ్డి గారికి దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి సోషల్ వర్కర్ దుగ్గి గంగాధర్ తెలపగా వారు భారత అంబాసి కువైట్ చట్టబద్ధమైన పనులన్నీ పూర్తీ చేయడమే గాక భారత అంబాసి ద్వారా ఉచితంగా టికెట్టు ఇప్పించడం జరిగింది. వైకాపా కువైట్ కమిటీ అభ్యర్ధన మేరకు రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి గారు మృతదేహాన్ని మద్రాస్ నుండి స్వస్ధలం వరకు ఉచితంగా వాహనం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భముగా ఇలియాస్, బాలిరెడ్డి గారు అంబాసి అధికారులకు ఎం. పి. మిధున్ రెడ్డి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. గవర్ని0గ్ కౌన్సిల్ సభ్యులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, మరియు అబ్దుల్ రౌఫ్ సమీప బంధువు హెచ్. భాస్కర్ సభ ఆసుపత్రి మార్చురీలో హెచ్. విరా మోహన భౌతికకాయాన్ని సందర్సించి నివాళిలు అర్పించారు.  

మృతదేహాం ఎయిర్ ఇండియా ద్వారా 14 - 12 -16న  కువైట్ నుండి బయలుదేరి 15 - 12 - 16న చెన్నై చేరింది     SUICIDE, PASSPORT , kuwaiti, mentally disturbed