కువైట్‌లో తెలుగు ప్రవాసి మృతికి కారణమైన మహిళ... ప్రవాసాంద్ర తెలుగుదేశం సేవావిభాగం సహయంతో మృతదేహం తరలింపు

Header Banner

కువైట్‌లో తెలుగు ప్రవాసి మృతికి కారణమైన మహిళ... ప్రవాసాంద్ర తెలుగుదేశం సేవావిభాగం సహయంతో మృతదేహం తరలింపు

  Fri Dec 09, 2016 16:01        Associations, Exclusives, Helping Hand, Kuwait, Telugu

కువైట్ లోని ఖైతాన్ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్న మదిపట్ల వెంకటరమణ నిన్న రాత్రి డ్యూటీ పూర్తయిన తర్వాత ఫర్వానియా లోని తన ఇంటికి వెళ్ళడానికి ఆఫీస్ వాహనంలో ఫర్వానియాలో దిగి, రోడ్డు దాటుతుండగా, ఈజిప్ట్ కు చెందిన ఒక ప్రవాస మహిళ కారుతో ఢీ కొట్టడం తో వెంకటరమణ తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతడ్ని హాస్పిటల్ కు తరలించి, రక్తం ఎక్కించి, చికిత్స చేస్తుండగా మృతి చెందాడు.

ఈ విషయం తెలుసుకున్న ప్రవాసాంద్ర తెలుగు దేశం సేవావిభాగం వారు హుటాహుటిన అక్కడికి చేరుకొని, మృతదేహాన్ని 48 గంటలలోగా మృతుని స్వగ్రామానికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

మృతుని వ్యక్తిగత వివరాలలోకి వెళ్తే... మదిపట్ల వెంకటరమణ చిత్తూరు జిల్లా లోని పీలేరు నియోజకవర్గం, కె.వి.పల్లి మండలానికి చెందిన వాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు, 11 సంవత్సరాల బాబు, 13 ఏళ్ల పాప ఉన్నారు. ఇతను 9 నెలల క్రితం ఉద్యోగ రీత్యా కువైట్ కు వచ్చాడు. 

ప్రవాసాంద్ర తెలుగు దేశం సేవావిభాగం చైర్మన్ మలేపాటి సురేష్ బాబు గారు, రెడ్డప్ప నాయుడు, సుధాకర్ నాయుడు, ఇతర సభ్యులు మరియు మృతుని గ్రామానికి చెందిన నాగభూషణం అనే వ్యక్తి సహాయసహకారాలతో కువైట్ లో సెలవు రోజులైనా కూడా అన్ని పేపరు క్లియర్ చేసి ఈ రోజు టికెట్ బుక్ చేసి, దేహాన్ని ఇంటికి పంపుతున్నారు. రేపు మార్నింగ్ మృతదేహం సొంత ఊరు చేరుతుంది.

ప్రవాసాంద్ర తెలుగు దేశం సేవావిభాగం వారు అన్నీ ఏర్పాట్లతో మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించడమే కాకుండా 25,000 ఆర్ధిక సహాయాన్ని అందిస్తుంది. NTR ట్రస్ట్ వారు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించుటకు అంబులన్స్ ను అందిస్తున్నారు. ప్రవాసాంద్ర తెలుగు దేశం సేవావిభాగం ఇలాంటి సత్వర సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు.   pravasandhra seva vibhagam, ptdp kuwait, ntr trust